కేబినెట్లో ఆ వైసీపీ యంగ్ ఎమ్మెల్యేకు ల‌క్కీ ఛాన్స్‌..!

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని ఎప్పటికప్పుడు కథనాలు కూడా వస్తున్నాయి…కానీ ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు గురించి అధికారిక ప్రకటన రాలేదు…పైగా ఉన్న మంత్రి వర్గాన్ని మొత్తం తొలగించి..కొత్తవారిని తీసుకుంటారా? లేక సగం మందినే తప్పించి…కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియడం లేదు..అసలు ఎంతమందిని తప్పించి…ఎంతమందిని మంత్రివర్గంలో తీసుకుంటారో క్లారిటీ లేదు.

అలాగే ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది తెలియడం లేదు…కానీ ఎవరికి వారు పదవి కోసం మాత్రం గట్టిగానే ట్రై చేస్తున్నారు..అయితే అందరికీ మంత్రి అయ్యే అదృష్టం ఉండదు..కులాలు, జిల్లాల సమీకరణాలు చూసుకుని పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రిగా ఛాన్స్ దొరకవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు…బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు క్యాబినెట్‌లో ఉన్నారు.

ఈ ఇద్దరిలో జయరాంని నెక్స్ట్ క్యాబినెట్ నుంచి తొలగించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు…ఇందులో పెద్దగా డౌట్ లేదని కర్నూలులో ప్రచారం నడుస్తోంది..అదే సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గనని పక్కన పెట్టడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఆర్ధిక శాఖని బుగ్గన తప్ప మరొకరు నడపటం చాలా కష్టం. మరి ఆయన స్థానాన్ని భర్తీ చేసే వారు ఉంటే పర్లేదు..లేదంటే బుగ్గనని మార్చడం కష్టం. ఒకవేళ బుగ్గనని మార్చకపోతే కర్నూలులో ఇంకో రెడ్డి నేతకు క్యాబినెట్‌లో అవకాశం ఇస్తారా? అనేది చెప్పలేం.

అయితే బుగ్గనని తప్పిస్తే మాత్రం శిల్పా చక్రపాణిరెడ్డికి ఛాన్స్ రావొచ్చని ప్రచారం జరుగుతుంది. శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా మంత్రి పదవిపై బాగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు..పైగా ఎమ్మెల్యేగా కూడా ఆయన బాగా పనిచేస్తున్నారు…వేరే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వచ్చింది గాని…శిల్పాపై పెద్దగా వచ్చినట్లు కనిపించడం లేదు..ఇప్పటికీ ఆయన శ్రీశైలంలో స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరి చూడాలి శిల్పాకు క్యాబినెట్‌లో ఛాన్స్ దొరుకుతుందో లేదో.