రష్మిలో ఆ పస లేదు.. అందుకు పనికి రాదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?

బుల్లి తెర పై రష్మి కి ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. అందంగా ఉంటుంది..బాగా నటిస్తుంది..స్పాంటెనియస్ గా జోకులు వేస్తుంది. తను ఒకరి జోలికి వెళ్లదు..తన జోలికి వచ్చారా..వదలదు. అంతకముందు కొన్ని సినిమాల్లో నటించినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ జబర్ధస్త్ అనే కామెడి షో ద్వారా మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఈ షో పుణ్యమా అంటూ మరి కొన్ని షోలల్లో కూడా కనిపిస్తుంది. బాగా సంపాదిస్తుంది అని చెప్పలేం కానీ, చేసిన ఒక్క ఈవెంట్ కి అయినా భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ తనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటుంది.

బుల్లి తెర పై ఆమెకు ఉన్న క్రేజ్ చూసి అమ్మడు వెండి తెరను కూడా ఏలేస్తుంది అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే రష్మికి పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఛాన్స్ వచ్చింది. తన స్దాయి శక్తుల ప్రయత్నించింది కూడా. కానీ అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోయింది. దీంతో డైరెక్టర్లు ఆమె కు నటించడం రాదు..కేవలం యాంకరింగ్ లు ..ఈవెంట్లు మాత్రమే చేసుకొవడానికి పనికి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారట.

కానీ ఆమెకన్నా వయసు లో పెద్దది అయిన అదే జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న అనసూయ మాత్రం..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బడా బడా స్టార్ హీరో సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ అటు బుల్లి తెర ఇటు వెండి తెర రెండింటిని ఏలేస్తుంది. రీసెంట్ గా పుష్ప సినిమాలో నటించిన ఈమె..ప్రజెంట్ రవితేజ ఖిలాడి, దర్జా మూవీ , పుష్ప 2 మూవీలకు కమిట్ అయ్యింది. అయితే ఇద్దరు బిడ్డలు తల్లైన అనసూయకు వస్తున్న అన్ని ఆఫర్లు..యంగ్ లుక్ లో..పర్ ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న రష్మికి ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. ఇక ఈ ప్రశ్నలకు అనసూయ అభిమానులు ఒక విధంగా రియాక్ట్ అవుతుంటే.. రష్మి అభిమానులు మాత్రం..మీ అనసూయలా మా రష్మికి రాసుకుని పూసుకుని తిరగడం రాదులే అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక రష్మి కూడా చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. చూడాలి ఈ సినిమా తరువాత అయినా రష్మికి మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తాయి ఏమో ..?

Share post:

Latest