భీమ్లా నాయక్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అంటే ఇదే..!!

భీమ్లా నాయక్..ఇప్పుడు ఈ పేరు చెబుతుంటే జనాలు ఊగిపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే..అంటూ కాలర్ ఎగరేశి చెప్పుతున్నారు. జై పవర్ స్టార్ అంటూ ఈలలు గోలలు..అబ్బో అది చెప్పితే అర్ధం కాదులేండి సినిమా ధియేటర్స్ బయట వాళ్ళు చేసే రచ్చ రచ్చ చూస్తే.. పవన్ అంటే ఇంత అభిమానమా..అని అనక తప్పదు. అందుకే అంటారు పవన్ అభిమానులు అభిమానమే వేరు. ఆయన కోసం ఏమైనా చేస్తారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్ల కోసం ఎంత కష్టపడుతున్నారో. కానీ కొందరికే టికెట్లు దొరుకుతున్నాయి. పవన్ సినిమా రేంజ్ అంటే అంతే. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఎవ్వరికి అనిపించదు చెప్పండి. అలా ఫ్యాన్స్ అరుపులు, కేకలు మధ్య పవన్ ఎంట్రీ సీన్ ఉంటే అద్దిరిపోది అంతే. మనకు తెలియకుండా నే బాడీలో ఆ ఊపు వచ్చేస్తుంది.

ఇప్పుడు ధియేటర్ లో భీమ్లా నాయక్ సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు అలాంటీ ఫీలింగ్ నే ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో రానా విలన్ గా పవన్ హీరోగా వచ్చిన్న భీమ్లా నాయక్ సినిమా నేడు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ని ప్రతి డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంటే అంత బాగా రాశారు త్రివిక్రమ్. ఇక ధమన్ మ్యూజిక్ ..మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమాకి. ప్రతి పాట..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పెట్టి ట్యూన్స్ కట్టాడు అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. నిత్యా మీనన్ గురించి మనకు తెలిసిందే ఆమె నేచురల్ యాక్టింగ్ కి బడా బడా హీరోలు సైతం ఫిదా అయ్యరు. ఈ సినిమాలో కూడా బాగా నటించి మెప్పించింది. ఇక సంయుక్త విషయనికి వస్తే ట్రైలర్ చూసిన జనాలు అమ్మడు గురించి పెద్ద గా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాకా అమ్మడుకి ఫ్యాన్స్ అయిపోయారు. సినిమాలో అమ్మడు క్యారెక్టర్ చించేస్తాది పొడిచేస్తాది అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. అభిమానులు అనుకున్న రీచ్ కి వెళ్లలేదు. ఈ విషయంలో అమ్మడుని బాగా వాడుకోలేకపోయాడు డైరెక్టర్. దీంతో తెర పై అమ్మడు క్యారెక్టర్ బిస్కెట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.