పాపం ఆ హీరో.. ఈవెంట్కు పిలిచి రాజమౌళి అసలుకే ఎసరు పెట్టేసాడు?

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్ కేవలం మొబైల్లోనే దొరుకుతుంది.. ఇక ప్రస్తుతం సినీ సెలబ్రిటీలపై ఎన్నో రకాల ట్రోల్స్ వైరల్ గా మారిపోతూ ఉన్నాయ్. ఇక కొన్ని రకాల మీమ్స్ చూసినప్పుడు వామ్మో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా బాబు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఇలా చిన్న విషయాలు కూడా మీమ్స్ ట్రోల్స్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మకమైన చిత్రం త్రిబుల్ ఆర్ ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది.

 

మొన్నటికి మొన్న జనవరి 7వ తేదీన విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. ఇక చివరికి 25వ తేదీన రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. సరిగ్గా త్రిబుల్ ఆర్ చిత్రబృందం విడుదల తేదీ ని ప్రకటించడానికి ఒకరోజు ముందే తమిళ్ హీరో శివ కార్తికేయన్ డాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు మార్చి 25వ తేదీన తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక త్రిబుల్ ఆర్ సినిమా తో శివ కార్తికేయన్ సినిమాకు ఎన్నో ఇబ్బందులు తప్పవు అన్నది తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కొన్ని ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

గతంలో త్రిబుల్ ఆర్ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్, శివకార్తికేయన్ లను అతిథులుగా పిలిచి వాళ్ళతో కాస్త ప్రమోషన్ చేయించారు జక్కన్న. వాళ్ళిద్దరూ కూడా రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు.. అంతా బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమా రిలీజ్ డేట్ రోజె త్రిబుల్ ఆర్ సినిమా కూడా విడుదలను జక్కన్న ప్రకటించడంతో ఈవెంట్ పిలిచి మరి రాజమౌళి శివ కార్తికేయన్ డాన్ సినిమా కు ఎసరు పెట్టాడు కదా అంటూ మీమ్స్ సృష్టించారు ఎంతో మంది నెటిజన్లు. ఇవి కాస్త తెగ వైరల్ గా మారిపోతున్నాయి.