ప్రియురాలితో వెంక‌టేష్ ముద్దుల కొడుకు నాగ్ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌… వైర‌ల్‌గా ఫొటోలు..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ముద్దుల కొడుకునాగ్ అన్వేష్ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అన్వేష్ త‌న ప్రియురాలినే పెళ్లాడ‌నున్నాడు. అదేంటి వెంక‌టేష్ కొడుకు అప్పుడే పెళ్లి ఈడుకు వ‌చ్చేశాడా ? అనుకుంటున్నారా ? అయితే ఆ కొడుకు వెంకీ రియ‌ల్ కొడుకు కాదు. వెంకీకి రీల్ కొడుకు. వెంక‌టేష్ కెరీర్‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు.. వంటిట్లో ప్రియురాలు ఒక‌టి. ఈ సినిమాలో వెంకీ ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల మొగుడిగా న‌టించాడు.

ఎమోష‌న‌ల్, కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. వెంకీ ఇద్ద‌రు భార్య‌లుగా సౌంద‌ర్య‌, వినీత న‌టించారు. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో వినీత కుమారుడినే త‌న ఇంట్లోకి తీసుకువ‌చ్చి పిల్ల‌లు పుట్ట‌ని సౌంద‌ర్య పెంచుకుంటుంది. ఈ సినిమాలో చిన్న‌ప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నాగ్ అన్వేష్ ఎంతోమందిని మెప్పించాడు.

నాగ్ అన్వేష్ ఇప్పుడు పెద్దోడు అయ్యాడు. ఆ త‌ర్వాత విన‌వ‌య్యా రామ‌య్యా సినిమాతో హీరోగా కూడా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే అన్వేష్ త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడు అవుతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయితో అంగ‌రంగ వైభ‌వంగా అన్వేష్ ఎంగేజ్‌మెంట్ అయ్యింది. నాగ్ అన్వేష్ – కావ్య గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం కుటుంబ స‌భ్యుల దృష్టికి తీసుకురాగా ఒప్పుకోవ‌డంతో వీరి ఎంగేజ్‌మెంట్ అయ్యింది.

కావ్య తండ్రి ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ అప‌ర్ణ కంపెనీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్. ఇక నాగ్ అన్వేష్ సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి కుమారుడే అన్న సంగ‌తి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో ప‌లువురు వీరికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.