యశోద సినిమాలో నటిస్తున్న ఈ నిన్నటి తరం బాల నటిని గుర్తుపట్టారా ?

ఇప్పుడు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్న చాల మంది నటీనటులు ఒకప్పుడు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చినవారే. ఒకసారి సినిమా రుచికి అలవాటు పడితే అది వారిని జీవితాంతం వదిలిపెట్టదు. ఆలా నిన్నటి తరంలో బాలనటిగా నటించి, ఆ తర్వాత కాలంలో చెల్లి పాత్రలకు పెట్టింది పేరుగా ఎదిగిన నటి మధురిమ నార్ల. ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. అద్భుత నాట్య కళాకారిణి కూడా. దేశ విదేశాల్లో ఎన్నో డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె క్లాసికల్ డ్యాన్సుకు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందాయి. నాట్య పరంగానే కాదు.. నటన పరంగానూ శభాష్ అనిపించుకుంది మధురిమ. పలువురు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

స్టార్ హీరోలకు చెల్లిగా, కూతురుగా పలు పాత్రలు పోషించి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు సమంతా హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ యశోదలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
మధురిమ సూపర్ స్టార్ హీరో కృష్ణ కి కూతురిగా బొబ్బిలి దొర సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ కు చెల్లెలిగా బొబ్బిలి సింహం, ‘పెద్దన్నయ్య వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కి సైతం చెల్లెలిగా ఒరేయ్ రిక్షా చిత్రంలో నటించి మెప్పించింది. వీటితో పాట పలు సినిమాల్లోనూ అనేక మంచి పాత్రలు పోషించింది. అనంతరం నాట్యం కోసం సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు లో రి ఎంట్రీ ఇచ్చింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన శతమానం భవతి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం చేసింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేసేందుకు కూడా రెడీ అవుతోంది.

తాజాగా హీరోయిన్ సమంత మెయిన్ రోల్ చేస్తున్న పాన్ ఇండియన్ సినమా యశోద. ఇందులో మధురిమ నార్ల చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తుందట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది. మధురిమతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.

ఇవి మాత్రమే కాదు అటు యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్ అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది మధురిమ. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష బొల్ల చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే జనాల ముందుకు రానుంది. ఏది ఏమైనా ఇలా బాలనటిగా, నటిగా, నాట్య కళాకారిణి గా ఇప్పటి వరకు విజయవంతంగా కెరీర్ సాగిస్తున్న మధురిమా మొత్తంగా సెంకెండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని మంచి అవకాశాలతో దూసుకెళ్లాలని కోరుకుందాం..