బ్రేకింగ్‌: డీజే టిల్లుకు రికార్డ్ స్థాయి క‌లెక్ష‌న్లు.. ఏం కుమ్ముడ్రా బాబు..!

ఈ యేడాది టాలీవుడ్ నుంచి వ‌చ్చిన హిట్ సినిమాల్లో మ‌రో సూప‌ర్ హిట్ సినిమా డిజే టిల్లు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ఉన్న సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన ఈ సినిమాకు విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన ఖిలాడి సినిమాకు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా ఖిలాడి ముందు నిల‌బ‌డుతుందా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే ఆ అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ డిజే టిల్లు దూసుకుపోతోంది. అస‌లు నైజాంలో అయితే తొలి రోజే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి ఊహాల‌ను త‌ల్ల‌కిందులు చేస్తూ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక డీజే టిల్లు అయితే యూఎస్ మార్కెట్ లో వండర్స్ చేస్తుందని చెప్పాలి.

ఫ‌స్ట్ డే కే అక్క‌డ బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసిన టిల్లు.. ఈ యేడాది అక్క‌డ రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. లాంగ్ ర‌న్ లో ఈ సినిమా అక్క‌డ 7-8 డాల‌ర్ల మ‌ధ్య‌లో వసూళ్లు రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

సిద్ధు లాంటి హీరోకు అక్క‌డ ఈ రేంజ్ వ‌సూళ్లు అంటే పెద్ద సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఏదేమైనా సితార వాళ్లు సిద్ధుకు మాంచి బ్రేక్ ఇచ్చారు.