స్టార్ డైరెక్టర్ నాతో అలా..చెప్పుకోలేని భయం నన్ను వెంటాడుతూనే ఉంది..అలియా సంచలన కామెంట్స్..!!

అలియా భట్..ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈమె అందాలు అలా అలా బార్డర్ క్రాస్ చేసి.. మన తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు చూస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. అమ్మడు గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువగానే కనిపిస్తుంది. నిజానికి అమ్మడు సినిమాలో కి రావడానికి పెద్దగా కష్టపడలేదు..వచ్చిన తరువాత ఆ పేరుని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు కావడంతో పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ… తన యాక్టింగ్ టాలెంట్, హార్డ్ వర్క్‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

పేరుకి బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ అయినా ..షూటింగ్ సెట్ లో మాత్రం అందరి తో చాలా చక్కగా కలిసి పోతుంటుంది అంటారు ఆమెతో వర్క్ చేసిన నటులు. ప్రస్తుతం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీల పై కన్నేసిన ఈ భామ దర్శకధీరుడు చిత్రీకరించిన ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించాలి అనుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలోను హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

అయితే , బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 25 న ధియేతృఅస్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అలియా ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో తనకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంది. నిజానికి సంజయ్ లీలా భన్సాలీ లాంటి గొప్ప డైరెక్టర్ డైరెక్షన్ లో చిన్న పాత్ర అయినా చేస్తే చాలు అని అనుకున్నా..కానీ, ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ లో నటిస్తుండడం నిజంగా నా అదృష్టం. సంజయ్ గారు ఈ సినిమా స్టోరీ నాకు చెప్పిన్నప్పుడు..చాలా భయపడ్డా..అప్పుడు ఆయన నాకు ధైర్యం చెప్పి..అందగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే మొదటిగా గంగుబాయి కథియావాడి సెట్లోకి వెళ్లగానే నాలో ఏదో చెప్పుకోలేని తెలియని భయం కలిగింది..ఆ తరువాత కొన్ని రోజులు ఆ భయం నన్ను ఎక్కడికి వెళ్లినా వెంటాడేది..కొన్ని రోజుల తరువాత అంత సర్ధుకుంది”అంటూ ఆమె ఈ సినిమా విషయంలో ఎంత భయపడిందో చెప్పుకొచ్చింది.