కృష్ణం రాజు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క..ఏం మాట్లాడవు ఏంటయ్యా ప్రభాస్ నువ్వు..?

ప్రభాస్..ఈ పేరు కి ఇప్పుడు ఎలాంటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరు అడుగుల ఆ అందగాడి కటౌట్ చూస్తే ఎటువంటి అమ్మాయి అయిన పడిపోవాల్సిందే. ఇక ఆయన చూస్ చేసుకునే సినిమాలు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అవుతాయి. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ డెలివరి అందరిని ఆకట్టుకుంటుంది. ఏ సీన్ కి ఎంత చేయాలో అంతే చేస్తాడు. మరీ ఓవర్ ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడు. ఓ సాధారణ హీరో గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తున్నారంటే అది మామూలు విషయం కాదు.

ఒక్కప్పుడు 40 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్న ఈయన ఇప్పుడు ఏ హీరో పుచ్చుకోని అంత రేంజ్ లో ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నాడు. సినిమా పరంగా చూసుకుంటే ప్రభాస్ తగ్గేదేలే అన్నట్లు వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కానీ, అభిమానులు ఆయన దగ్గర నుండీ మరి ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ ఆరు అడుగుల అందగాడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని వాళ్ళ అమ్మ తో పాటు అభిమానులు..స్టార్ సెలబ్రిటీలు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ , ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు.

ఇక ఎప్పటి నుండో హీరోయిన్ అనుష్క, ప్రభాస్ లవ్ చేసుకుంటున్నారని..త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక వాటి పై ఎప్పటికప్పుడు ప్రభాస్ అనుష్క మా మధ్య అలాంటిది ఏం లేదు రా బాబోయ్..మేము ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయితే, రీసెంట్ గా ప్రభాస్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో అనుష్కకు జరిగిన అవమానం చూసాక.. అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి ఆఫీస్ లో ఉన్న ఒక్క స్టాఫ్ అతనికి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

ఇక ఆ పెళ్ళికి ప్రభాస్ తో పాటు గా కృష్ణం రాజు గారి కుటుంబ సభ్యులు మొత్తం హాజరు అయ్యారు , వారిలో అనుష్క కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేనా పెళ్లి ప్రారంభం దగ్గరి నుండి తాళి కట్టేవారుకూ కూడా అనుష్క .. లీడ్ తీసుకుని పెద్ద మనిషి పాత్ర వహించి అన్ని పనులు దగ్గరుండి చూసుకుందట. దీంతో అందరు అనుష్కానే ఉప్పలపాటి ఇంటి కోడలు అంటూ ఫిక్స్ అయిపోయారట. ఫంక్షన్ లో ఇదే హాట్ టాపిక్ అవ్వడంతో..కృష్ణం రాజుకి కోపం వచ్చిందట. అనుష్క ను పక్కకు పిలిచి.. ఇలా నువ్వు అన్ని విషయాల్లో ఎంటర్ అవ్వడం బాగోలేదు అమ్మ..ఇలా నీ గురించి ప్రభాస్ గురించి మాట్లాడుకోవడం మీ ఇద్దరి జీవితాలకి మంచిది కాదు. ప్రభాస్ కు దూరంగా ఉండూ అంటూ చెప్పుకొచ్చారట. దీంతో బాధపడిన అనుష్క కన్నీళ్ళు పెట్టుకుంటూ కొంచెం సేపు అక్కడే ఉండి ఆ తరువాత ఎవ్వరికి చెప్పకుండానే వెళ్ళిపోయిందట. దీని పై ప్రభాస్ అభిమానులు కృష్ణం రాజు పై కోపడుతున్నారు. ప్రభాస్ నువ్వు అయినా చెప్పాలి గా ఆయనకి అలా మాట్లాడకండి అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దిన్ని బట్టి చూస్తే ప్రభాస్-అనుష్క లకి పెళ్లి చేసుకోవాలి అని ఉంది కానీ కృష్ణం రాజునే అడ్డుపడుతున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు.

Share post:

Latest