వర్మ మా వాడు.. కాదు కాదు మా వాడే..

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ పరిచయాలు అక్కర్లేని సెలబ్రిటీ అలాగని రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే వివాదాలు ఎక్కడుంటే అక్కడే రాంగోపాల్ వర్మ ఉంటారు. తాజాగా ఏదైనా అతిపెద్ద అనవసరపు వివాదం ఏదైనా ఉంది అంటే అది ఏపీలోని ప్రభుత్వం వర్సెస్ థియేటర్స్ మరియు సినిమా పరిశ్రమ మామూలుగానైతే వర్మ ఈపాటికే ఈ విషయంలో దూరి నానా రభస చేయవలసింది. కానీ ఎందుకో చలికాచుకునే అవకాశం ఉన్నా కాస్త లేట్ అయ్యాడు లేటుగా ఎంటరైన కూడా ఈ మంటల్లో తన చలిని చక్కగా కాసుకుంటున్నారు .

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వర్మ,జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలిమంట తీర్చుకోవడమే. మామూలుగా వర్మ అంటే అటు నందమూరి అభిమానులు ,ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులుకు కానీ అస్సలు గిట్టదు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే వర్మ అంటే భగ్గుమనే స్థాయి. వర్మ కూడా అదే స్థాయిలో పవన్ని గిల్లుతూ వివాదాన్ని సృష్టిస్తుంటారు. ఇక తెలుగు దేశం పార్టీ అయితే తన స్థాయికి మించి డ్యామేజీ సృష్టించి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అంతా గతం ఏ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ తెలుగుదేశం అభిమానగణం అంతా వర్మని అసహ్యించుకునే ఈ మొత్తం బ్యాచ్ కి వర్మ ఒక టార్చ్ బేరర్గా కనబడుతున్నాడు ఇప్పుడు .

ప్రస్తుతం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వర్మ ట్వీట్స్ ,దానికి మంత్రి పేర్ని నాని కౌంటర్ ట్వీట్స్ .. దానికి వర్మ మళ్లీ రివర్స్ కౌంటర్లు పైన పేర్కొన్న బ్యాచ్ మొత్తం ఫుల్ సపోర్ట్ గా ఇది కదా మేము కోరుకున్నది నీ నుండి అంటూ సోషల్ మీడియాలో మొత్తం మా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ వర్మ పోస్ట్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, వైరల్ చేయడం ఒకటేమిటి చేయగలిగింది అంతా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఏ వర్మ అయితే తమ బద్ధశత్రువు అని ఫీల్ అయ్యారు ఇప్పుడు వరకు అదే వర్మ ని ఆకాశానికి ఎత్తుతూ వర్మ మావాడే కాదు కాదు మా వాడు కూడా అంటూ ఎవరికి వారు వర్మని ఎత్తుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసిపి జనాలు ఇదేం కర్మ రా బాబు అంటూ చస్తున్నారు. ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు ఎప్పటిలాగే రేగుతున్న వివాదాన్ని తన వైపు తిప్పుకుని మొత్తం తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు వర్మ . తనకు కావాల్సింది ఇదే కదా ..అందుకే దటీజ్ వర్మ అంటారు అందరు .

– కల్కి