గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హాట్ యాంకర్ రష్మి గౌతమ్ ?

తెలుగు బుల్లితెరపై యాంకర్స్ ఎంత మంది ఉన్న అందులో కొత్త మందే హాట్ యాంకర్స్ ఉంటారు.వాళ్లలో ముందు వరసలో ఉండేది మాత్రం రష్మి గౌతమ్ .బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయినా ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. సినిమాల్లో కూడా రష్మి అప్పుడప్పుడు మెరుస్తుంటారు.ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి మీడియా సర్కిల్ లో వైరల్ అవుతుంది .

అదేనండి కరోనా లాక్ డౌన్ లో రష్మి రహస్యంగా పెళ్లి చేసుకుందట.బుల్లితెర నటుడు సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందంటూ చాల కాలం నుండి వార్తలు వస్తున్నాయి . రష్మి ,సుదీర్ మాత్రంచాల స్టేజీలు పై తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని చెబుతూ వచ్చారు. అయితే రష్మీ ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందట. అయితే రష్మి గౌతమ్ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిందంట. ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తన్నాయి.

ఇండస్ట్రీ సెలిబ్రేటీలు కరోనా లాక్ డౌన్ లో చాలా మంది పెళ్లిళ్లు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయట పెట్టట్లేదట . దాని కారణం ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతాయని ఆలోచనలో ఉందంట .టాప్ యాంకర్ అయినా ఉదయభాను , సుమ , అనసూయలకు బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అదే కారణమో లేక మరేదైనా కారణం ఉందొ తెలియదు .