నాగార్జునను బాగా వేధించిన సమస్య ఏంటో తెలుసా?

నాగార్జున వయసు 60 ఏండ్లు దాటినా.. ఆయన 30 ఏండ్ల యువకుడి లాగే కనిపిస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ హీరోగా.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. అయితే ఆయన గ్లామర్ కు కారణాలు చాలా ఉన్నాయట. పుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేస్తాడట. ఆరోగ్యం విసయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాడట. ఇంత కఠినంగా ఉండే నాగార్జున సైతం ఓ వ్యసనానికి బానిస అయ్యాడట. ఇంతకీ ఆయను తప్పుదారి పట్టించిన ఆ వ్యసనం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 తాజాగా తనను కొంత కాలం వేధించిన సమస్య గురించి నాగార్జున ఇటీల వెల్లడించాడు. అదేంటో కాదు.. మద్యం . కొంత కాలం పాటు తాను మద్యానికి బానిస అయినట్లు వెల్లడించాడు. ఆహారం విషయంలో చాలా కేర్ గా ఉండే ఆయన.. ఓ సినిమా కారణంగా మందుకు బానిస అయినట్లు చెప్పాడు. నాగార్జున-నాని కాంబినేషన్ లో దేవదాసు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున డాన్ పాత్ర పోషించాడు. అయితే ఇందులో నాగార్జున ఎప్పుడూ తాగుతూ కనిపించాలి. సినిమాలో ఆ క్యారెక్టర్ సహజంగా రావాలి అని సాయంత్రం 2 పెగ్గులు వేసి సెట్ కు వచ్చేవాడట. అలా అనుకోకుండా మందుకు బానిస అయ్యాడట. అయితే ఈ అలవాటు నుంచి బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. చివరకు ఆ చెడు అలవాటుకు దూరం అయినట్లు వెల్లడించాడు.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ దేవదాస్ సినిమాను నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. వాస్తవానికి మద్యం కారణంగా ఎంతో మంది గొప్ప నటులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎస్వీఆర్, రంగనాథ్, రాజబాబు లాంటి వారు ఈ లోకాన్ని విడవాల్సి వచ్చింది.  అటు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన  5ను కంప్లీట్ చేసిన ఆయన.. ఓటీటీ బిగ్ బాస్ షో హోస్ట్ గా చేయనున్నాడు. అటు బంగార్రాజు మూవీతో సంక్రాంతి బరిలో నిలవనున్నాడు.