అలాంటి అమ్మాయిలంటే ఇండస్ట్రీకి పిచ్చి.. నిజాలు తెలిపిన అర్చన..!!

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలు, దర్శకుల కామపు వలలో చిక్కుకొని ధైర్యంతో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వారికి చెప్పినట్టు చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకున్న వారు కూడా ఉన్నారు అని ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.. మీటు అనే ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలను సోషల్ మీడియా ముందు బహిర్గతం చేస్తున్నారు..

ఇకపోతే ప్రముఖ నటి అర్చన సినీ ఇండస్ట్రీ కి అలాంటి అమ్మాయిలంటే పిచ్చి అంటూ షాకింగ్ నిజాలు తెలిపింది..బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాలం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని , అదే సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో కూడా ఒక చిన్న పాత్ర రావడంతో ఈ సినిమాకు ఒప్పుకుని , అంత మంచి సినిమాను వదులుకున్నాను అని ఆమె తెలిపింది. కానీ తన సినీ కెరీర్లో తనకు జరిగిన అవమానాలు , అనుభవాలను కూడా వెల్లడించింది.

ఇక ఈమెకు ఒక ప్రశ్న ఎదురవడంతో షాకింగ్ కామెంట్ చేసింది.. ఇండస్ట్రీ లో ఒక టాప్ డైరెక్టర్ ఉన్నారని , అతను కథ చెప్పేటప్పుడు ఒక రకంగా చెప్పి, షూటింగ్ చేసే సమయంలో డైలాగులు, కథ కూడా మారుస్తూ ఉంటాడని చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాడు అని తెలిపింది.. ఇది ఏంటి అని ప్రశ్నించినప్పుడు.. ఆ డైరెక్టర్ చెప్పే మాటలు వింటే మనమే తప్పు అనే భావన కలుగుతుందని ఆమె తెలియజేసింది.. సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి మైండ్ సెట్ చాలా వీక్ గా ఉందని తెలిస్తే, కచ్చితంగా ఆ అమ్మాయిని త్వరగా ట్రాప్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అని అలాంటి అనుభవం తనకు కూడా ఎదురైందని తెలిపింది. కానీ ఆ మైండ్ సెట్ నుంచి నేను తొందరగా రియాక్ట్ కావడం వల్ల సమస్య నుంచి బయట పడ్డాను అని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో అమాయకపు అమ్మాయిలు అంటే చాలా పిచ్చి అని చెప్పుకొచ్చింది అర్చన.