ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను ..స్టార్ హీరోపై సమంత కామెంట్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లు వరుసగా నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు సంబంధించి మాట్లాడారు. సుకుమార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యాడు.

అలాగే ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసిన సమంతను ప్రశంసించారు. ‘ పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థాంక్స్. మీరు మమ్మల్ని ఎంతగానో నమ్మారు. మా మీద నమ్మకంతో ఈ సాంగ్ చేశారు. ఆ నమ్మకానికి థాంక్స్. ఈ పాట చేసే ముందు నీకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పాట చేయడం తప్పా.. ఒప్పా.. అని ఆలోచనలో ఉండిపోయావు. నన్ను నమ్ము.. అని నేను ఒక మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా వేయకుండా పాట చేశావు.అది నా గుండెను తాకింది. నీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది.’ అని అల్లు అర్జున్ సమంతపై పొగడ్తల వర్షం కురిపించాడు.

కాగా తనను ప్రశంసిస్తూ బన్నీ చేసిన కామెంట్స్ కు సమంత ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చింది. బన్నీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను..అని ట్వీట్ చేసింది. కాగా పుష్ప సినిమాలో ఊ.. అంటావా మావా.. ఉఉ..అంటావా మావా.. స్పెషల్ సాంగ్ చేయడంపై సమంతకు విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. సమంత ఈ పాట చేయడంపై ముందు విమర్శలు వచ్చినా.. ఇప్పుడు ఈ పాట అందరి నోళ్లలో నానుతోంది. పుష్ప సినిమా విజయవంతం కావడానికి ఈ పాట కూడా ఎంతో దోహదం చేసింది.