క్లాస్‌మేట్‌తో పవన్ కళ్యాణ్ ఫ‌స్ట్ లవ్‌..ఎలా చెడిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సొంత టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పర్చుకున్నాడు. మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ప‌వ‌న్‌.. జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏపీ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాడు. ప్ర‌స్తుతం ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడీయ‌న‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందని అని అమ్మాయిని వివాహం చేసుకున్న ప‌వ‌న్‌.. ప‌లు మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత హీరోయిన్‌ రేణు దేశాయ్‌ను ఓ పిల్లాడిని క‌న్నాక పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. చివ‌ర‌కు తీన్మార్ సినిమాలో తనతో కలిసి నటించిన అన్నాలెజ్నోవాను ప‌వ‌న్ మూడో పెళ్లి చేసుకున్నాడు.

ఇవ‌న్నీ అంద‌రికీ తెలిసిన విష‌యాలే. కానీ, క్లాస్‌మేట్‌తో పవన్ కళ్యాణ్ ఫ‌స్ట్ లవ్ గురించి మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్రాస్‌లో కంప్యూట‌ర్ క్లాసుల‌కు వెళ్తున్న రోజుల్లో.. అక్క‌డ‌కు ఓ అంద‌మైన అమ్మాయి కూడా వ‌చ్చేద‌ట‌. ఆమె ప‌వ‌న్‌తో ఎంతో క్లోజ్‌గా మాట్లాడేద‌ట‌. దాంతో చుట్టూ ఉండే ప‌వ‌న్ స్నేహితులు మీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది స్నేహమే కాదు ప్రేమ కూడా అని రోజూ చెప్పేవార‌ట‌.

ఫ్రెండ్స్ చెప్పిన మాట‌ల‌తో త‌న‌ది ప్రేమే అనుకున్న ప‌వ‌న్‌.. స‌ద‌రు అమ్మాయికి ప్ర‌పోజ్ చేయాల‌ని సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ఓ రోజు ఆ అబ్బాయి వ‌ద్ద‌కు వెళ్లిన ప‌వ‌న్‌.. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పేశాడు. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ.. అసలు ప్రేమంటే ఏమ‌నుకుంటున్నావ్‌.. ఈ వ‌య‌సులో ప్రేమేంటి..ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే అంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకింద‌ట‌. దాంతో ఖంగుతిన్న ప‌వ‌న్ సైలెంట్ అయిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత ఆమె ముఖ‌మే చూడ‌లేద‌ట‌. మొత్తానికి అలా ప‌వ‌న్ ఫ‌స్ట్ ల‌వ్ చెడింది.