టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మూవీ మేకర్స్.. నిన్న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేయగా.. అంగ రంగ వైభవంగా ఈ ఈవెంట్ జరిగింది. అలాగే ఈ వేడుకలో రష్మిక బ్లాక్ శారీలో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
మరోవైపు తగ్గేదే లే అనే డైలాగ్‌తో తన అభిమానుల చేత కేకలు పెట్టించిన అల్లు అర్జున్.. తనదైన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రష్మిక గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. `నేనుచాలా మందితో పని చేస్తాను. కానీ మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక.
ఆమె నేషనల్ క్రష్ కాబట్టి నేను ముద్దుగా “క్రష్మిక“ అని పిలుస్తుంటా. ఎంతో టాలెంట్ ఉన్న రష్మికకు మంచి ఫ్యూచర్ ఉంది.` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బన్నీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా, రష్మిక శ్రీవల్లిగా కనిపించబోతున్నారు. అలాగే ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు.