బాక్స్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న భీమ్లానాయక్ అప్డేట్..!!

దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ ఏదో విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక దీంతో అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. మరి ఇప్పుడు కూడా ఈ రోజు ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ ను అందిస్తున్నారు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది.


ఇకపోతే అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ అప్డేట్స్ ను మేకర్స్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ నుంచి మరొక డీజే వెర్షన్ సాంగ్ ని ఈనెల 31న రాత్రి 7 గంటల 2 నిమిషాలకు విడుదల చేయబోతున్నామని తెలియజేశారు. ఈ నెల 31 న కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలు చేసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ప్లాన్ చేశారు అన్నట్టుగా సమాచారం. లా లా భీమ్లా నాయక్ అనే పాటని థమన్ మళ్లీ డీజే వెర్షన్ లో మార్చి విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/SitharaEnts/status/1476062935424258050?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1476062935424258050%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-34068073043971482760.ampproject.net%2F2111242025001%2Fframe.html