ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడులైంది.
టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. `ఉ అంటావా మామ..ఉఊ అంటావా మామ..` అంటూ సామ్ సోషల్ మీడియా ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.
అయితే తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో సుకుమార్.. సమంత చేసిన `ఉ అంటావా మామ..ఉఊ అంటావా మామ..` ఐటెం సాంగ్ వెనక ఉన్న ఆసక్తికర కథను వెల్లడించారు. సుకుమార్ మాట్లాడుతూ.. `ఈ పాట రాసింది ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్. ఆయన ఈ పాటను ఇప్పుడు కాదు నాలుగేళ్ళక్రితమే రాసి నాకు వినిపించారు.
ఈ పాట విపరీతంగా నచ్చినప్పటికి ఈ నాలుగేళ్ళలో ఉపయోగించుకునే అవకాశం రాలేదు. అయితే ఈ పాటను ఎవరికీ ఇవ్వొద్దని చంద్రబోస్‌తో అప్పుడే చెప్పారు. ఇక ఫైనల్‌గా పుష్ప పార్ట్ 1కు ఈ పాటను వినియోగించుకున్నాను` అంటూ చెప్పుకొచ్చారు.