ఆ వంటల‌కు 242 కోట్ల మంది వ్యూవర్స్..ఆదాయం తెలిస్తే పిచ్చెక్కాల్సిందే !

ప్ర‌స్తుతం రోజుల్లో టాలెంట్ ఉండాలే కానీ.. డ‌బ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో యూట్యూబ్ ఒక‌టి. ఈ యాప్ వినోదాన్ని పంచేదే కాదు.. పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను మ‌రియు కోట్ల సంపాద‌న‌ను తెచ్చిపెట్టే యాప్ కూడా. అలా దేశంలోనే యూట్యూబ్‌లో స‌క్సెస్ అయిన టాప్-10 వ్య‌క్తుల్లో నిషా మధులిక ఒక‌రు.

1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించిన నిషా మ‌ధులిక.. డిగ్రీ చ‌దివారు. ఆ తర్వాత గుప్త అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిర పడ్డ నిషా మ‌ధులిక‌.. ఇద్ద‌రు సంతానం. భ‌ర్త‌, పిల్ల‌ల‌ను చూసుకుంటూ నిషా ఇంట్లోనే ఉండేది. అయితే పిల్ల‌లు పెద్ద వారై చ‌ద‌వులు, ఉద్యోగాల కోసం విదేశాల‌కు వెళ్లిపోయారు. దీంతో ఒంట‌రిత‌నాన్ని భ‌రించ‌లేక‌పోయిన నిషా మ‌ధులిక‌.. 48 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకుని 2007లో బ్లాగ్‌ ప్రారంభించి భారతీయ వంటకాల తయారీని అందులో రాసే వారు.

అయితే కొంద‌రు వంట‌కాల‌ను రాయ‌డం కంటే త‌యారు చేసి చూపించ‌మ‌ని నిషాకు స‌ల‌హా ఇచ్చారు. దాంతో 2011లో `ఫుడ్‌ అండ్‌ రెసిపీ` యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలు పెట్టి.. ర‌క‌ర‌కాల వంట‌ల‌ను చేసి చూపించింది. శాకాహారం పైనే ఈమె ఇప్పటి వరకూ 1700 వీడియోలు చేసింది.

దీంతో క్ర‌మంగా ఆమె సబ్‌స్క్రైబర్స్ సంఖ్య‌ 1.22 కోట్లకు చేర‌గా.. ఆమె వంట‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 242 కోట్ల 88 లక్షల మంది వ్యూవ‌ర్స్ చూశారు. ఇక యూట్యూబ్ ద్వారా నిషా మ‌ధులిక ఏడాదికి రూ.2 కోట్ల‌కు పైగా సంపాదిస్తోంది. దీంతో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న యూట్యూబర్‌గా నిషా మ‌ధులిక రికార్డు సృష్టించింది. అలాగే అవార్డుల‌ను, రివార్డుల‌ను కూడా ఈమె అందుకుంది.