ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టిన జక్కన్న.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విషయంలో స్వయంగా దర్శకుడు రాజమౌళి ఓ ప్రకటన చేసి ఇప్పుడు అందరి చూపును మళ్లీ ‘ఆర్ఆర్ఆర్‌’వైపు తిప్పాడు. ఈ సినిమా ట్రైలర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని తమకు తెలుసని, అందుకే ఈ ట్రైలర్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసేందుకు ఇంత సమయం పట్టిందని ఆయన అన్నాడు.

కాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను డిసెంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తామని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రాజమౌళి తెలిపాడు. ఇక ఈ ట్రైలర్‌లో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.