ఎనిమి సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..!

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి ఈ సినిమాలో మరొక హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ శంకర్ వహించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాలిని నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం.

ఈ సినిమా మొదటిరోజు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా మొదటి రోజే ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్న. ఆ తర్వాత పెద్దగా ఈ సినిమా జోరు చూపించలేకపోయింది. ఈ సినిమా మొదటివారం కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-92 లక్షలు.
2). సీడెడ్-48 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-29 లక్షలు.
4). ఈస్ట్-22 లక్షలు
5). వెస్ట్-18 లక్షలు
6). గుంటూరు-23 లక్షలు
7). కృష్ణ-19 లక్షలు
8). నెల్లూరు-15 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..2.66 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 3.8 కోట్ల బిజినెస్ జరగగా. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యే సరికి..2.66 కోట్లను మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా మిగిలిన కలెక్షన్లను రాబడుతోంది లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.