చిరు మూవీలో స‌ల్మాన్‌..ఫుల్ క్లారిటీ ఇచ్చిన త‌మ‌న్‌!

November 11, 2021 at 2:48 pm

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది.

Chiru 153 is 'God Father,' fans get motion poster as a birthday gift | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ స్పియర్‌ను రంగంలోకి దించబోతున్నారు అనే ప్ర‌చారం కూడా ఉంది. అయితే తాజాగా వీట‌న్నిటిపై మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

SS Thaman signs a crazy Tamil multistarrer

తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌మ‌న్ మాట్లాడుతూ.. గాడ్ ఫాద‌ర్‌ సినిమాలో చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట ఒక‌టి ఉంది. కాబట్టి దాని స్థాయికి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రిట్నీ స్పియర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని త‌మ‌న్ పేర్కొన్నాడు. ఈయ‌న వ్యాఖ్య‌ల‌తో సల్మాన్ చిరు మూవీలో న‌టించ‌డ‌మే కాదు.. ఆయ‌న‌తో డ్యాన్స్ కూడా చేయ‌బోతున్నాడ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది.

చిరు మూవీలో స‌ల్మాన్‌..ఫుల్ క్లారిటీ ఇచ్చిన త‌మ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts