షణ్ముఖ్ జస్వంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రశాంతి?

యాంకర్ ప్రశాంతి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాని గృహలక్ష్మి సీరియల్ లాస్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో ఆమె నటించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంతకుముందే ఈమె బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గృహలక్ష్మి సీరియల్ లో నెగిటివ్ రోల్ తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంతి తన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది.

ఈ సందర్భంలోనే పలువురు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రశ్నించగా.. ప్రశాంతి స్పందిస్తూ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ తెలుసని, అందరికీసపోర్ట్ ఉంటుందని తెలిపింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో పర్ఫామెన్స్ బాగున్న వాళ్లకు ఓటు వేసి గెలిపించండి అంతేకానీ గేమ్ ఆడకుండా కూర్చునే వాళ్ళకి బయట ఫాలోయింగ్ చూసి ఓటు వేయకండి అంటూ పరోక్షంగా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది.