అఖండ డైలాగ్ లీక్.. జై బాలయ్య అనాల్సిందే!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే విషయం పక్కనబెట్టి, తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు. ఇక మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మరోసారి నటిస్తుండటంతో అఖండ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రేపు సోషల్ మీడియాలో బాలయ్య దెబ్బ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆలోచిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని ఓ డైలాగ్ సోషల్ మీడియాలో లీకయ్యింది. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాలయ్య చెప్పే ఈ పవర్‌ఫుల్ డైలాగ్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటని మీరు అనుకుంటున్నారా?

‘‘ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు.. రైట్ లేదు, లెఫ్ట్ లేదు.. అటు వైపు నేనే.. ఇటు వైపు నేనే..’’ అంటూ సాగే ఈ డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఇక ఈ డైలాగ్‌ను బాలయ్య నోటితో వింటే ఆ కిక్కే వేరు అంటున్నారు నందమూరి అభిమానులు. మరి బాలయ్య ఈ డైలాగు చెబుతుంటే మీలో ఎంతమంది చూడాలని కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి.