చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని అంచ‌లంచలుగా ఎదిగిన ఈయ‌న‌..దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి సూప‌ర్ స‌క్సెస్ అయిన చిరు..ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు.

NYAYAM KAVALI | TELUGU FULL MOVIE| CHIRANJEEVI | RADHIKA | JAGGAYYA | TELUGU CINEMA CLUB - YouTube

అటువంటి గొప్ప వ్య‌క్తి చెంప వాచిపోయేలా కొట్టిందో హీరోయిన్‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధిక. గ‌తంలో చిరు-రాధిక‌లు క‌లిసి ఎన్నో చిత్రాలు చేశారు. వాటిల్లో `న్యాయం కావాలి` సినిమా కూడా ఒక‌టి. ఈ చిత్రంలో రాధికను ప్రేమించినట్టు నటించి ఆమెను శారీరకంగా వాడుకుని వదిలేసే పాత్రను చిరు పోషించారు. ఈ సినిమా షూటింగులో భాగంగా చిరంజీవిని కొట్టే సన్నివేశం ఒక‌టి ఉంటుంది. అయితే ఆ సీన్ రియ‌లిస్టిక్‌గా రావ‌డం కోసం చిరు.. త‌న‌ను నిజంగానే కొట్ట‌మ‌ని రాధిక‌కు చెప్పార‌ట‌.

 అలా చిరంజీవి చెంప చెల్లుమనిపించింది హీరోయిన్. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని సరదాగా నవ్వుకుంటారు చిరంజీవి, రాధిక. షూటింగ్‌లో పర్ఫెక్షన్ కోసం అప్పటి నటీనటులు ఇలాగే చేసేవాళ్లు. మరీ ముఖ్యంగా చిరంజీవి అయితే ఒళ్లు హూనం చేసుకునేవాడు. గూండా సినిమాలో ఓ సీన్ కోసం ఏకంగా కదిలే రైలు కింద పడుకుని యాక్షన్ సీన్స్ చేసాడు. అప్పట్లో అవి ఓ సంచలనమే.,[object Object]

కానీ, అందుకు రాధిక నిరాక‌రించింద‌ట‌. నిజంగా కొడితే సీన్ పర్ఫెక్షన్ బాగుంటుంద‌ని, ఎక్కువ టేకులు కూడా ప‌ట్ట‌వ‌ని చిరు చెప్ప‌డంతో.. చివ‌ర‌కు రాధిక ఒప్పుకుంద‌ట‌. ఇక కోదండరామిరెడ్డి యాక్షన్ చెప్పగానే రాధిక నిజంగానే చిరంజీవి చెంప చెల్లుమ‌నిపించింద‌ట‌. అది చూసిన అక్కడ వాళ్ళు అందరూ షాకయ్యార‌ట‌. వెంట‌నే చిరు ద‌గ్గ‌ర‌కు వెళ్లి అస‌లు నిజం తెలుసుకున్నార‌ట‌. ఇక విచిత్రం ఏంటంటే రాధిక కొట్టిన దెబ్బకు చిరు చెంప వాచిపోయింద‌ట‌. ఐస్ పెట్టుకుంటేగాని త‌గ్గ‌లేద‌ట‌.