ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ మొన్నీ మధ్య తన 25వ చిత్రంగా `స్పిరిట్`ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది.
అలాగే టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ప్రభాస్ పుచ్చుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి గానూ ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లను రెమ్యూనరేషన్‌గా పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది.
ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఆయన అడిగిన భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించారని తెలుస్తోంది. కాగా, ప్రభాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రాధేశ్యామ్‌ను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాలను చేస్తున్నారు.