సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్ అభిమాని?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు అఖిల్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ వినిపిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా రిలీజ్ రోజున సోషల్ మీడియాలో హీరో అఖిల్ పేరు కంటే అఖిల్ వీరాభిమాని అయినా అయ్యగారి పేరు ఎక్కువగా వినిపించింది.

అయ్యగారి అంటే ఎవరు అనుకుంటున్నారా.. ఇతను అఖిల్ వీరాభిమాని. ఈ సినిమా రిలీజ్ రోజున కొంత మంది ప్రేక్షకులు అఖిల్ సినిమా కోసం ఎదురు చూడగా.. మరికొంతమంది అఖిల్ డై హార్డ్ ఫ్యాన్ అయినా అయ్యగారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. సోషల్ మీడియాలో అఖిల్ ఫ్యాన్ అయ్య గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ని చూసి యూజర్లు నివ్వెరపోయారు.

https://www.instagram.com/p/CVFRgOcpeWE/?utm_source=ig_web_copy_link

అయ్యగారి ఫ్యాన్ ఒక తియేటర్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కటౌట్ కు కొబ్బరికాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక వాడే గొప్ప పులి పులి కింగ్ కొడుకు అంటూ కేకలు వేశాడు. ఇక అయ్యగారి ఉత్సాహం చూసిన ఇతర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #ayyagareno 1 అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.