పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా.. సినిమా ఏదంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన కెరీర్లో 19వ సినిమాను ప్రముఖ ఎడిటర్ గ్యారి బిహెచ్ చేయబోతున్నాడు. ఈ సినిమాను రెడ్ సినిమాస్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు చరణ్ తేజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు లాంఛనంగా మొదలయ్యాయి. ఇందుకు ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, శ్రీకాంత్ అడ్డాల హాజరయ్యారు. వీరి చేతుల మీదగా ఆ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కి అందించారు. అలాగే అసలు మంచి సక్సెస్ అవ్వాలని విషెస్ తెలిపారు.

ఇక ఈ సినిమా ముహూర్తం షాట్ కు దర్శకుడు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఆయన కుమార్తె ఈశన్వి, అలాగే కుమారుడు ధ్రువ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ సినిమాలు హీరో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు నిఖిల్ మొదటిసారిగా గూడచారి పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకు మనోజ్ రెడ్డి సినిమాటో గ్రాఫర్ కాగా, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుద్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అలాగే రవి అంటోనీ ప్రొడక్షన్ డిజైనర్ వ్యవహరిస్తున్నారు.