బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే ఇప్పటికే 5 వారాలు గడిచిపోయింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఆరో వారం ఎలిమినేట్ టైమ్ దగ్గర పడింది. ఇక ఈ వారానికి ఈ నామినేషన్ లో ఏకంగా పది మంది ఉన్నారు. ఈవారం షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కోసం నామినేషన్ లోకి రాగా కాజల్ అనీ మాస్టర్ వంటి కంటెస్టెంట్ లు తప్పించుకున్నారు. ఇక విశ్వా, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేతా,శ్రీ రామచంద్ర ఎలిమినేట్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఉన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు చూస్తుంటే ఈ వారము డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రము శ్వేతా ఎలిమినేట్ కానుంది. నిజానికి హౌస్ మేట్స్ అందరిలో శ్వేత,విశ్వ కు తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. కానీ విశ్వ ఈ వీక్ కెప్టెన్ గా మరొకసారి ఎన్నిక కావడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. కానీ ప్రస్తుతానికి సీతా వర్మ కు అతి తక్కువ ఓట్లు ఉండడంతో, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.