సహనటిని వివాహం చేసుకోబోతున్న మంచువారబ్బాయి..!!

మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక పెళ్ళికి సిద్ధం అయ్యాడు అనే వార్త ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ మాత్రం ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు తన స్నేహితులతో కొన్ని ప్రదేశాలను చూసి వచ్చాడు.

అసలు తనకు రెండో పెళ్లి ఆలోచన కూడా లేదని ఎప్పుడు చెప్పలేదు. అయితే కొంత మంది మాత్రం ఎన్ని రోజులను ఇలా ఉంటావు రెండో పెళ్లి చేసుకో అంటూ కొందరు ఆయనకు చెప్పినట్లుగా సమాచారం. అందులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక దీంతో మరొకసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న నట్లు గా కనిపిస్తోంది మంచు మనోజ్.

అయితే ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారని విషయం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఒక విషయం మాత్రం బాగా వైరల్గా అవుతోంది. తన సినిమా లోనే ఒక ఫారెన్ అమ్మాయి నటించింది. ఇక ఆమెతోనే ప్రేమలో ఉన్నాడనే వార్త బాగా వినిపిస్తోంది. అయితే ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. కానీ మంచు మనోజ్ సంబంధిత వర్గాలు మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లే అంటున్నాయి. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.