పుష్పక విమానం సినిమా ట్రైలర్ని విడుదల చేయడానికి వస్తున్న స్టార్ హీరో..?

దొరసాని సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద దేవరకొండ. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా పుష్పకవిమానం సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాని దర్శకుడు దామోదర తెరకెక్కించడం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని నవంబర్ 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ కార్యక్రమాని కి విజయ్ దేవరకొండ కూడా హాజరు కాబోతున్నారు.

ఈ సినిమా గోవర్ధన్ రావు, విజయ్ దషి, దేవరకొండ, ఎర్రబెల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను బాగా పాపులర్ చేసుకునేందుకు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.