పూజ హెగ్డే పాటతో సురేఖవాణి వీడియో వైరల్..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సురేఖవాణి సోషల్ మీడియాలో రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఆమెతో పాటు తన కూతురు సుకృతం కూడా భారీ స్థాయిలో క్రేజ్ ను అందుకునేలా చేస్తోంది. ఇక తల్లి కూతుర్లు అంటే వీళ్లు ఎవరు నమ్మలేరు. అంత గ్లామర్ గా కనిపిస్తుంటారు. సురేఖ వాణి భర్త చనిపోయిన తర్వాత కూడా కూతురు బాధ్యతలు తీసుకున్న ఆమె ఎప్పటిలాగానే సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నది.

అయితే సురేఖ వాణి రెండో వివాహం చేసుకున్నది అంటూ రకరకాలుగా కథలు రావడం మొదలయ్యాయి. ఇదివరకు ఒకసారి సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు సురేఖవాణి కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లుగా కొన్ని కథలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఇవన్నీ వట్టి పుకార్లే అని చెప్పుకొచ్చింది. అయితే సురేఖ వాణి సోషల్ మీడియాలో ఒక వీడియో ని పోస్ట్ చేసింది. అందులో ఆమె తల్లి తో కనిపించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి.

ఇక తాజాగా పూజ హెగ్డే నటించిన బ్యాచిలర్ సినిమా పాట లెహ్ రాయి అంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

https://www.instagram.com/reel/CVKE6SpA4HG/?utm_source=ig_web_copy_link