వామ్మో..ఆ ఫ్యామిలీతో ఆటలు అస్సలు ఆడ‌కూడ‌దంటున్న స‌మంత‌..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. ఇప్ప‌టికే గుణ‌శేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవ‌ల మ‌రో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను సైతం ప్ర‌క‌టించింది.

Samantha Ruth Prabhu Needs Time To Bring Her Focus Back

ఇక త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా స‌మంత ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో స‌మంత.. ఆమె స్నేహితులు శిల్పారెడ్డి ఫ్యామిలీతో టగ్ ఆఫ్ వార్ ఆడారు. వాస్తవానికి ఈ వీడియోను శిల్పారెడ్డినే మొద‌ట‌ పోస్టు చేయగా, సమంత దాన్ని రీపోస్ట్ చేశారు.

Samantha has the best birthday wish for fashion designer Shilpa Reddy. See stylish pic - Movies News

అంతేకాదు, `ఫిట్ నెస్ అంటే పడిచచ్చే, పోటీతత్వానికి మారుపేరులా నిలిచే ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదు. మనం ఏ మాత్రం నెగ్గలేం సరికదా, మనకు దెబ్బలు కూడా తగులుతాయి` అంటూ కామెంట్ పెట్టుకొచ్చింది. దాంతో సామ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.