బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేసిన‌ ఎన్టీఆర్‌..కార‌ణం..?

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేశాడ‌ట ఎన్టీఆర్‌. ఈ విష‌యం ఎవ‌రో కాదు ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్.

Jr NTR to start shooting for Evaru Meelo Koteeswarulu soon - Times of India

`లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ ఏ చిత్రంలోని అని 10 రూపాలయ ప్రశ్న.. అందుకు స‌ద‌రు వ్య‌క్తి నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన `న‌ర‌సింహ‌నాయుడు` చిత్రంలోనిది అంటూ క‌రెక్ట్ స‌మాధానం ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Telugu7.com:20 years of balakrishna narasimha naidu cinema-‌ఇరవై ఏళ్ళ ' నరసింహనాయుడు'

తార‌క్ మాట్లాడుతూ.. నేను న‌ర‌సింహ నాయుడు సినిమాను తొలి రోజునే ఊర్వశి థియేటర్‌లో చూశాను. చూసేట‌ప్పుడు వ‌చ్చిన గూజ్‌బంప్స్‌తోముందున్న కుర్చీని ఒక్క త‌న్ను త‌న్నాను. దెబ్బ‌కు కుర్చీ విరిగిపోయింది. కుర్చీలో కూర్చున్న వ్య‌క్తీ కింద‌ప‌డిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడాయ‌న కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.