బిగ్‌బాస్ 5: మ‌ళ్లీ ర‌విని ఏకేసిన నాగ్‌..మండిప‌డుతున్న ఫ్యాన్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. నేడు లోబో బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ‌నివారం కావ‌డంతో హోస్ట్‌గా నాగార్జున ఇంటి స‌భ్యుల త‌ప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు.

Bigg Boss Season 5 Telugu: Episode 56: Nagarjuna's Selected Favoritism

ఈ లిస్ట్‌లో ఎప్ప‌టిలాగానే యాంక‌ర్ ర‌వి కూడా ఉన్నారు. అయితే ర‌విని నాగార్జున మొద‌టి నుంచీ చెడుగుడు ఆడుకుంటున్నాడు. గుంటనక్క, మోసగాడు, ఇతరుల ఆటను ప్రభావితం చేసే వ్య‌క్తి అంటూ దోషిలా నిలుచోబెడుతూ ఘోరంగా అవ‌మానిస్తున్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ ర‌వి విష‌యంలో అదే జ‌రిగింది. ఇటీవ‌ల ర‌వి..తన భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంద‌ని, బిగ్ బాస్ వాళ్లు ఎలా ఉన్నారో చెప్పాలని, లేదా తననైనా బయటకు పంపాలని కోరాడు.

Anchor Ravi Biography, Age, Wiki, Height, Weight, Girlfriend, Family & More -

ఈ విష‌యంపైనే ర‌విని ఏకేశాడు నాగ్‌. `నీకే ఫ్యామిలీ ఉందా? వీళ్లెవరికీ ఫ్యామిలీ లేదా..? ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ పంపాలో వాళ్లకి తెలుసు.. నీకోసం రూల్స్ ఛేంజ్ చేయరు కదా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండగలవని చెప్పడమే ఈ గేమ్ ఉద్దేశం.. నువ్ ఈ గేమ్ గురించి అన్నీ తెలుసుకునే ఒప్పుకుని వచ్చావు.. డబ్బు కోసం రాలేదని అంటున్నావ్.. నీకు కావాలంటే వెళ్లిపోవచ్చు.. పోతావా? గేట్లు ఓపెన్ చేయిస్తా.. వెళ్లిపోతానంటే వెళ్లిపో..` అంటూ నాగ్ దారుణంగా మాట్లాడారు. అయితే ఈ విష‌యంలో ర‌వి ఫ్యాన్స్ నాగ్‌పై మండిప‌డుతున్నారు. చిన్న విషయంపై అంత ఓవ‌ర్ రియాక్ట్ అవ్వ‌డం ఎందుక‌ని నాగ్‌కి హిత‌వు ప‌లుకుతున్నారు.