దేశంలోనే ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహం.. సిద్ధం చేయించిన స్టార్ హీరో ఎవరంటే..!

October 31, 2021 at 10:01 am

డాన్స్ మాస్టర్,నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ రాఘవేంద్ర స్వామి కి ఎంత పరమ భక్తుడో తెలిసిందే. తన సినిమాల్లో లారెన్స్ ఏదో ఒక సందర్భంలో రాఘవేంద్ర స్వామి ప్రస్తావన తీసుకు వస్తుంటాడు. తల్లి అన్న లారెన్స్ కు ఎంతో అభిమానం. అందుకే లారెన్స్ తమిళనాడులో తన తల్లికి ఒక గుడి కట్టించాడు. అక్కడ నిత్యం పూజలు జరిగేలా చూస్తుంటాడు.

తాజాగా దేశంలోనే అతి ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని లారెన్స్ సిద్ధం చేయించారు. అతి త్వరలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రాఘవేంద్ర స్వామి విగ్రహం ముందు కూర్చొని ఉండగా తీసిన ఫోటోలు కూడా ఈ సందర్భంగా లారెన్స్ షేర్ చేశాడు.

‘రాఘవేంద్ర స్వామి అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరికగా ఉంది. అది ఇంత కాలానికి నెరవేరుతుండటంతో ఎంతో సంతోషంగా ఉంది. విగ్రహాన్ని అతి త్వరలోనే ప్రతిష్టించి.. ప్రజలు పూజలు చేసేందుకు అనుమతి ఇస్తామని’ లారెన్స్ ట్వీట్ చేశాడు.లారెన్స్ సిద్ధం చేయించిన రాఘవేంద్ర స్వామి విగ్రహం 15 అడుగుల ఎత్తు ఉంది. మార్బుల్ రాయితో ఈ విగ్రహాన్ని సిద్ధం చేయించారు.

దేశంలోనే ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహం.. సిద్ధం చేయించిన స్టార్ హీరో ఎవరంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts