శ్యామ్,చైతులకు అభిమానులు విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. రొమాంటిక్ కపుల్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా వీరిద్దరి వ్యవహారం వినిపిస్తోంది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని సమంత నాగచైతన్య అభిమానులు కానీ, అలాగే సినీ సెలబ్రిటీలు కానీ ఊహించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వార్తలు గానే వెళ్లిపోతాయని అనుకున్నారు.

 

చై, సామ్ భార్యభర్తలుగా విడిపోతున్నామని,కాని మంచి స్నేహితులుగా ఉంటామని వారిద్దరూ తమ ట్వీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొందరు హార్ట్‌ బ్రోకెన్‌, ఇది నిజం కాదని చెప్పండి. రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లో కూడా మీది హిట్‌ పెయిర్‌ అంటూ కొంతమంది కామెంట్స్‌ చేయగా మరికొందరూ చై-సామ్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్నారట.ఇక పై మిమ్మల్ని రియల్‌ లైఫ్‌ కపుల్‌గా చూడలేము కాబట్టి కనీసం సినిమాల్లో అయినా చూసే అవకాశం మరొకసారి ఇవ్వండి. మీరిద్దరూ జంటగా మరో సినిమా చేయాలి’ అని కోరుతున్నారట.