మంచు విష్ణుకు తన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా..?

సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల వ్యవహారం రోజురోజుకు ఎక్కువవుతోంది అని చెప్పాలి.. అయితే ఈ మా వేడి రేపటితో చల్లబడుతుంది అని చెప్పవచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు , మరొకవైపు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు రసవత్తరంగా మాటల తూటాలు విసురుకున్నారు. ఇకపోతే మంచు విష్ణుకు సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సపోర్ట్ ఇస్తున్నారనే చెప్పాలి..ఇక ప్రకాష్ రాజ్ కి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తోందని వార్తలు రోజురోజుకు సంచలనంగా మారాయి.

ఎందుకంటే తెలుగువాళ్ళ అందరు తెలుగువాడిని గెలిపించాలి అని అంటున్న నేపథ్యంలో, మెగాస్టార్ ఫ్యామిలీ తెలుగువాళ్ల అయుండి కూడా కన్నడవాళ్లకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.. అనే ప్రశ్న అందరి మదిలో ప్రశ్నార్థకం గా మారిపోయింది. ఇకపోతే మంచు విష్ణు ఫ్యామిలీ విషయానికి వస్తే.. మంచు విష్ణు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కానీ మంచు మనోజ్ కానీ ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు అని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు మంచి ఫ్యామిలీ కూడా మంచు విష్ణుకు సపోర్ట్ చేయడం లేదా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది..

నిజం చెప్పాలంటే మంచులక్ష్మి ప్రస్తుతం ఇండియాలో లేదు.. ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మంచు మనోజ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో టూరిస్ట్ ప్రాజెక్టు లో బిజీగా ఉన్నాడు. కానీ ఇంట్లో కలుసుకున్నప్పుడు మా ఎలక్షన్లలో ముందుకు ఎలా వెళ్లాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి..? అనే విషయాలు మాత్రం మంచు విష్ణు.. తన అక్క, తమ్ముడు ,తండ్రితో కలిసి చర్చిస్తున్నట్లు సమాచారం. అందుకే వాళ్లు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , వాళ్ళ సలహాలు సూచనల మేరకు మంచు విష్ణు ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.సపోర్టింగ్ అనేది పక్కనుంచే చేయాలనే లేదు..ఎక్కడినుంచైనా చేయొచ్చు అని మంచు ఫ్యామిలీ స్పష్టం చేసింది.