సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడం వల్ల ఎవరికి లాభం కలిగింది..?

సమంత – నాగచైతన్య దాదాపు పది సంవత్సరాల పాటు ప్రేమించుకుని , ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలపాటు ఎంతో అద్భుతంగా తమ వైవాహిక జీవితాన్ని గడిపారు. ఏమైందో తెలియదు కానీ సడన్ గా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..కానీ వీరి అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసినా, అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు విడిపోతున్నాం అని ప్రకటించడంతో ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు.

రకరకాలుగా వీరిద్దరిపై కామెంట్లు వస్తున్నప్పటికీ, నాగచైతన్య మాత్రం నోరు విప్పడం లేదు.. కానీ సమంత విడాకులు తీసుకోవడం తో చాలా బాధ పడుతున్నాను అని, నాగచైతన్యను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాను.. అలాంటిది కొన్ని కారణాల వల్ల నాగచైతన్యను వదులుకోవాల్సి వస్తోంది.. ఇంతకంటే నరకం నాకు ఎక్కడా కనిపించలేదు.. అంటూ ఆమె తీవ్రంగా తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తోంది. కొన్ని దుష్ట శక్తుల కారణంగా విడాకులు తీసుకుంటున్నానని చెప్పిన సమంతా , నాగ చైతన్యను వదులుకోలేక దుష్టశక్తుల శక్తికి తట్టుకోలేక ఎట్టకేలకు జీవితంలో ఒంటరితనాన్ని గడపడానికి సిద్ధమవుతోందని చెప్పాలి.

ఇక నాగచైతన్య మాత్రం సమంతా నుంచి విడిపోతున్నప్పుడు ఎలాంటి బాధను కూడా వ్యక్త పరచలేదు. నిజంగానే నాగచైతన్యకు సమంత అంటే ఇష్టం లేదా..? అందుకేనేమో సమంత గురించి ఒక్క వాక్యం కూడా చేయడం లేదు. సమంత , నాగచైతన్య విడాకులు వ్యవహారంలో నాగచైతన్యకు లాభం ఉందనే చెప్పాలి. పాపం సమంత తన జీవితాన్ని ఎటువైపు మళ్లించు కోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు ప్రేక్షకుల మదిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.