మా సభ్యత్వానికి.. ప్రకాష్ రాజ్ రాజీనామా చేశాడా… లేదా ఎవరైనా చేయించారా..!

మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం వెనక ఎవరైనా హస్తం ఉందా అన్నట్లుగా ఇప్పుడు కొంతమంది సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపాడు ప్రకాష్ రాజు. ఈ మేరకు ప్రకాష్ సార్ సోషల్ మీడియా ద్వారా కూడా ఒక పోస్ట్ ని తెలియజేశారు.

మాకు మద్దతుగా నిలిచిన మా సభ్యులకు నమస్కారం. మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్ధం ఉంది. మిమ్మల్ని మేము నిరాశపరచని త్వరలోనే అన్నిటిని వివరిస్తూ అంటూ రాసుకొచ్చారు. మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు తో పోటీ చేసి ప్రకాష్ రాజు ఓడిపోవడం జరిగింది. మొత్తం మీద 18 మంది కార్యవర్గ సభ్యులలో..10 మంది విష్ణు ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించగా..8 మంది ప్రకాష్ రాజ్ అభ్యర్థులు గెలుపొందారు.

ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ మా ఎన్నికలు ప్రాంతీయవాదం జాతీయవాదం నడుమ జరిగాయని తెలుగు వాడు కాని వాడు మా ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. కానీ పోటీ చేయకూడదా..? తెలుగు వాడిని కాకపోవడం నా తప్పు ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజు.