ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ తాజా చిత్రం `రాజా విక్రమార్క`. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామారెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో తన్యా రామచంద్రన్ హీరోయిన్గా నటించగా..తనికెళ్ల భరణి కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, థీమ్ సాంగ్ ఇలా అన్నీ ఆకట్టుకోగా.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అవును, నవంబర్ 12న ‘రాజా విక్రమార్క’ విడుదల కానుందంటూ తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. కాగా, ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.