దండుపాల్యం గ్యాంగ్ తో దుమ్ములేపుతున్న”తగ్గేదే లే” టీజర్..?

దండుపాల్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విలక్షణ నటుడు శ్రీనివాసరాజు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం తగ్గేదే లే. ఈ సినిమాలో హీరోగా నవీన్ చంద్ర, హీరోయిన్ దివ్య పిళ్లే, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది.

- Advertisement -

ఇక దాంతో మరొకసారి సినిమా దండుపాలెం సినిమా ను గుర్తు చేసింది ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లా కనిపిస్తోంది. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ టీజర్లో.

ఇక ఈ సినిమాలో యాక్షన్ రొమాన్స్ లు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమన్నది ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఎట్టకేలకు ఈ సినిమా తో రవీంద్ర ఒక హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Share post:

Popular