అందరికీ దూరంగా వెళ్లి ఎంజాయ్ చేస్తున్న అల్లు.. స్నేహ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడు ఎక్కువ సమయాన్ని తన కుటుంబానికే కేటాయిస్తాడు. ఇక పుష్ప సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లి అక్కడ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించి ఒక వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది తన భార్య అల్లు స్నేహ. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. అంతేకాకుండా అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ కొంత మంది ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

https://www.instagram.com/reel/CVMrpYFDkjG/?utm_source=ig_web_copy_link