ప్ర‌భాస్‌తో గ‌డిపిన ఆ క్ష‌ణాలు మ‌రచిపోలేనంటున్న యంగ్ హీరోయిన్‌!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అంటే తెలియ‌ని వారుండ‌రు.. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ముఖ్యంగా మ‌న డార్లింగ్‌కి లేడీస్ ఫాలోయిన్ చాలా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు సైతం ఆయ‌నకు ఫిదా అవుతుంటారు. ఇక ఈ టిస్ట్‌లో యంగ్ హీరోయిన్ కేతిక శ‌ర్మ కూడా చేరింది.

Romantic Trailer | Prabhas Praises Akash Puri And Ketika Sharma - video Dailymotion

పూరి జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుండ‌గా.. ఇటీవ‌ల ప్ర‌భాస్ ఆకాశ్-కేతికాల‌ను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేసి సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాడు.

ఆ పిల్ల బాత్ రూమ్ లో నేనెందుకు ఉంటా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కేతికా శ‌ర్మ‌.. ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్ మా టీంను పిలిచారు.. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేక‌పోయాను. ఇక ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. సింపుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మ‌రియు ఆయనతో గ‌డిపిన‌ ఆ కొన్ని క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను.` అంటూ కేతిక చెప్పుకొచ్చింది.

Ketika Sharma: Wiki, Bio, Age, Height, Weight, Family, Boyfriend, Parents