ఆ ట్రీట్మెంట్ వల్లే నా జీవితం ఇలా అయింది.. ప్రఖ్యాత మోడల్

దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో సూపర్ మోడల్ లిండా ఎవాంజెలిస్టా కూడా ఒకరు. 80, 90 లలో లిండా నవోమి కాంప్ బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్ తో పాటు రాంప్ వాక్ లో పాల్గొంది. దీంతో పాటు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్లలో తన ఫోటోలను సైతం ప్రచురితమయ్యాయి. మొదటి పాపులర్ మోడల్ అయినప్పటికీ ఒక మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆమె జీవనోపాధిని నాశనం చేసింది అంటూ తాజాగా లిండా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో ఐదు సంవత్సరాల క్రితం తాను చేయించుకున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల తాను శాశ్వత అంగవైకల్యం చెందినట్లు లిండా తెలిపింది.

ఈ మోడల్ కు 56 ఏళ్ల సమయంలో ఓ సంస్థ సర్జరీ లేకుండా ఫ్యాట్ కంటెంట్ తొలగిస్తామని నమ్మబలికి చివరికి ఆ వైద్యం దానికి విరుద్ధంగా జరిగింది అంటూ ఆరోపించింది. కాకుండా ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ తన జీవన ఆధారాన్ని పూర్తిగా నాశనం చేసిందని, దానితో తీవ్ర నిరాశ లోకి పంపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలోనే ఒంటరిగా మారిపోయాను అంటూ ఆమె ఆరోపించింది. లిండా తనకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఎందుకు ఫ్యాషన్, అలాగే వినోద ప్రపంచంలోనే పలువురు నుంచి లిండా కు మద్దతు లభిస్తోంది. కొందరు ఈమెకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు