‘ది టర్న్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉండబోతుందో తెలుసా?

డీబీ దొరబాబు దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ హీరోగా సినిమా ది టర్న్. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇందులో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ నటిస్తున్నారు. అలాగే వాసంతి, రత్నమాల ఫిమేల్ లీడ్స్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాను కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తుండగా ఆర్ సారధి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇది నేడు హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చాలా బాగుంది మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం..త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.