ముంబై కొత్త ఇంటికి సమంత ఒంటరిగా వెళ్ళిపోనుందా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య అలాగే అతని భార్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా, అనేక రకాల రూమర్స్ వస్తున్నా కూడా ఈ విషయంపై నాగచైతన్య సమంత స్పందించడం లేదు. ఇక వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ లో సమంత మిస్సింగ్ అవడంతో అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

ఇదిలా ఉంటే ఇటీవల సమంత ముంబై లో ఒక ఇల్లు కొనింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వగానే సమంత హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడికి ఒంటరిగా గడపడానికి ముంబై కి వెళ్లనుందా లేదా నాగచైతన్యతో కలిసి జంటగా అక్కడికి వెళ్లానుందా అంటూ అనేక రకాల ప్రశ్నలు ఎత్తు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ మాన్ 2 తరువాత సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో ముంబై కి వెళ్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.