స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..ఇలా ఎప్పుడూ చూసుండ‌రు!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ స‌మంత గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో స‌మంత‌కు మనస్పర్థలు వ‌చ్చాయ‌ని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైంద‌ని ఇలా ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై ఎన్నెన్నో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇవేమి ప‌ట్టించుకోని స‌మంత సినిమాల నుంచి స్మాల్‌ గ్యాప్‌ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

Samantha Akkineni looks unrecognisable in latest pics; take a look | Lifestyle News,The Indian Express

త‌న క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో క‌లిసి స‌మంత స‌ర‌దాగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న స‌మంత‌.. వ‌రుస ఫొటో షూట్ల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా కూడా లైట్ పింక్ క‌ల‌ర్ లెహంగా ధరించి సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటీ.

జుట్టు పైకి ముడివేసి, ముక్కుకు ముక్కెర ధరించి ఒకింత ట్రైబల్ లుక్ లోకి మారిపోయిన స‌మంత‌.. ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం స‌మంత లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మున్నెప్పుడూ చూడ‌ని విధంగా స‌మంత క‌నిపిస్తుండ‌డంతో.. నెటిజ‌న్లు, అభిమానులు ఆమె పిక్స్‌పై ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు.