బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రేపటి నుంచి ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు సైతం కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే క్వారంటీన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ముందు స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చివరిగా ఓ పోస్ట్ పెట్టగా.. ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఆయన తన ఫోటో షేర్ చేస్తూ షార్ట్ గా ‘IWMYA’ అంటూ కామెంట్ చేశాడు. దీన్ని పూర్తిగా విశదీకరిస్తే ‘l WILL MISS YOU ALL’ అని అర్థం అవుతుంది.
ఒకసారి హౌస్‌లోకి వెళ్లారంటే.. బయట ఏం జరిగినా వాళ్లకు తెలియదు. ఫోన్లు, టీవీ వంటి గడ్జెట్స్ ఏమి ఉండవు. ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో సంబంధాలు ఉండవు. అందుకే షణ్ముఖ్ అలా పోస్ట్ పెట్టారని అంటున్నారు. కాగా, బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్‌లో మొదటి నుంచీ షణ్ముఖ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక ఈయన తాజా పోస్ట్‌తో హౌస్‌లోకి షణ్ముఖ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయింది.
https://www.instagram.com/p/CTSFqiMH0eU/?utm_source=ig_web_copy_link