ప్రముఖ తెలుగు హీరో అరెస్ట్.. కారణం..!

టాలీవుడ్ లో నటుడు కృష్ణుడు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ వినాయకుడు సినిమా హీరో అంటే తక్కువ గుర్తుపడతారు.ఇక ఈ హీరోని కొన్ని గంటల క్రితం పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు చేశారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

పోలీసులు పేకాట ఆడవాళ్ళ మీద రైడింగ్ చేయగా అందులో నటుడు కృష్ణుడు కూడా ఉండడం చేత ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది.తాజాగా హైదరాబాదులో మియాపూర్ లో అతను పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కేవలం ఇతడొకడే కాకుండా మరొక పది మందిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

పేకాట క్లబ్ నిర్వాహకుడు పెద్దిరాజు నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక ఈయన టాలీవుడ్ లో కొన్ని సినిమాల లోనే నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు. అయితే పేకాట ఆడుతూ దొరకడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇక ప్రస్తుతం కృష్ణుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా కొంతమంది నటులు ఇలా చేయడం సినీ ఇండస్ట్రీకి చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.